Homeహైదరాబాద్latest Newsరేవంత్.. సిగ్గులేకుండా కండువాలు క‌ప్పుతున్నవ్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రేవంత్.. సిగ్గులేకుండా కండువాలు క‌ప్పుతున్నవ్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం తెచ్చిందే కాంగ్రెస్..
  • ఫిరాయింపులను ప్రొత్సహించేది మీరే..
  • కేసీఆర్ ఎవ‌రికీ కండువాలు క‌ప్పలేదు..
  • గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లోకి వచ్చారు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు చేయించి తీరుతామన్నారు. రెండు రోజులుగా స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని, త‌మ‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. బుధవారం జగదీష్‌రెడ్డి తెలంగాణ భ‌వ‌న్‌లో విలేకరు సమావేశంలో మాట్లాడారు. త‌మ‌కున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి కండువాలు క‌ప్పుతున్నార‌ని జ‌గ‌దేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాంచ్‌ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీయే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయొద్దని ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డే చెప్తున్నారని ఆయన వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు చ‌ట్టం ప్రకారం తామే బీఆర్ఎస్‌లో విలీనం అవుతాం అని చెప్పారని, ఆ మేర‌కు సీఎల్పీని చ‌ట్టబ‌ద్దంగా విలీనం చేశారన్నారు. కేసీఆర్ ఎలాంటి ఉల్లంఘ‌న‌కు పాల్పడ‌లేదని, మీ స‌భ్యుల‌కే మీ పార్టీపై విశ్వాసం లేక 23 మంది ఎమ్మెల్యేల‌ మెజార్టీతో విలీనం చేశారని కోర్టు పేర్కొందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img