Homeఫ్లాష్ ఫ్లాష్Revanth reddy:వివాదమైన రేవంత్ వ్యాఖ్యలు...రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం

Revanth reddy:వివాదమైన రేవంత్ వ్యాఖ్యలు…రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం

Revanth reddy: అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారాన్ని రేపాయి. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని , చిన్న సన్నకారు రైతులకు మూడు గంటలు , మొత్తం ఎనిమిది గంటలు చాలని రెవంత్ రెడ్డి చెప్పడంతో ఇది వివాదస్పదమైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఅర్ సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ నైజం బయట పడిందని విమర్శించారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఅర్ఎస్ పార్టీ అందోళనలకు దిగడంతో కాంగ్రెస్ పార్టీ అత్మరక్ష్ణణలో పడింది. అది పార్టీ నిర్ణయం కాదని మేము కూడా ఉచిత కరెంటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని , అసలు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత తమదేనని జరిగిన డ్యామేజీని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే బీఅర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎరబెల్లి దయాకర్ రావు , జగదీశ్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్థించారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని గుర్తు చేశారు. ఉచిత క‌రెంట్‌పై తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మాట‌ల‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్‌పై హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి మాటలపై వ్యయశాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ మెదడులో గుజ్జు లేదన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ‌ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత‌ కండ్ల మంట ఎంత ఉందో అర్థమవుతుందన్నారు.

Recent

- Advertisment -spot_img