Homeఫ్లాష్ ఫ్లాష్REVANTH REDDY: రేవంత్ వ్యాఖ్యలపై ఠాక్రే రియాక్షన్ ఇదే..

REVANTH REDDY: రేవంత్ వ్యాఖ్యలపై ఠాక్రే రియాక్షన్ ఇదే..

  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే
  • ప్రజలు హస్తం పార్టీనే నమ్ముతున్నారు
  • కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే

ఇదేనిజం, హైదరాబాద్: ఉచిత విద్యుత్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (REVANTH REDDY) అమెరికాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు కాంగ్రెస్ (CONGRESS)పై విరుచుకుపడుతున్నారు.

దీంతో కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KOMATI REDDY) స్పందించారు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ మాటలను వక్రీకరించారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముతున్నారని పేర్కొన్నారు. రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందంటూ ఇటీవల రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img