HomeతెలంగాణRevanth reddy:రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు -రేవంత్

Revanth reddy:రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు -రేవంత్

Revanth reddy: కేంద్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాహుల్‌ గాంధీ పదవి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్ఎస్ అవివేకమన్నారు. పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసింది. అధికారులు, బీఆరెస్ ప్రజాప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి సభకు రాకుండా జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ అన్ని కుట్రలను చేధించి ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసిన ఖమ్మం ప్రజలకు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
కాంగ్రెస్ సభ విజయవంతకావడంతో అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలు పెట్టాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమన్నారు. అలాంటి రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని వ్యాఖ్యానించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. మీరు అంటగాకుతున్న నరేంద్ర మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే ఆ అర్హత ఉందా? అని బీఆర్ఎస్ నేతలను రేవంత్ నిలదీశారు.
“రాహుల్ ను విమర్శిస్తున్న అసలు మీకున్న అర్హత ఏంటి? ట్విట్టర్ పిట్ట, సారా సీసాలో సోడా కలిపేటోడు, మంత్రులు ప్రతి ఒక్కరు రాహుల్ అర్హతపై ప్రశ్నిస్తున్నారు. భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతుండు కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్ అర్హత గురించి ప్రశ్నించరు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదో బీఆరెస్ నేతలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img