– నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.