– సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన వారి బాధలను నేరుగా వినడంతో పాటు సంబంధిత శాఖలకు సూచనలు కూడా చేశారు. కొన్ని సమస్యలను ఎన్నికల కోడ్ ముగియగానే పరిష్కరిస్తామని చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ ఉద్యోగి దయాకర్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనకు 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేశాడు. లోక్‌సభ ఎన్నికల నియయామవళి ముగియగానే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.