Revanth reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని అన్నారు. కానీ నేడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోటీ పడడం ఏంటి ప్రపంచంతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. ఈరోజు ఈ నగరం విశ్వ నాగారంగా పెరగాలి.. పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినపుడు ఆలా ఏపీతో పోటీ పడాలి.. మనకంటే అమరావతి ముందుకు వెళ్తుంది.. మనం ఆంధ్రతో ఏంటి అయ్యా పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడదాం.. న్యూ యార్క్ లేదా టోకీయ లేదా దుబాయ్ లేదా.. ఈ నగరాలతో పాటు మౌలిక సదుపాయాలు పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తీ తెలంగాణ ప్రజలకి ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.