Homeహైదరాబాద్latest NewsRevanth Reddy : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష

ఇదేనిజం ప్రతినిధి, కామారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి ఎంపీ స్థానం దక్కించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. సురేష్ షెట్కార్​ను భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్​రెడ్డి, బాన్స్​వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి ఏనుగు రవీందర్​రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి చంద్రశేఖర్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img