HomeరాజకీయాలుRevanth Reddy : తెలంగాణలో ‘ప్రజాస్వామ్యం’ లోపించింది

Revanth Reddy : తెలంగాణలో ‘ప్రజాస్వామ్యం’ లోపించింది

– సోనియా పూనుకున్నందుకే రాష్ట్రం సాకారం
– టీజీని టీఎస్​గా మార్చడం కుట్ర
– రాష్ట్రంలో రాచరిక పోకడలు కనిపిస్తున్నాయి
– ప్రతిపక్షాలను బానిసల్లా చూస్తున్నారు
– మీట్​ ది ప్రెస్​లో పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ పూనుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకుంటే.. వంద మంది కేసీఆర్​ లు పోరాటాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఉద్యమసమయంలో తెలంగాణను టీజీగా పేర్కొనేవారని.. కానీ బీఆర్ఎస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని టీఎస్​ గా మార్చారని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో నిర్వహించిన మీట్​ ది ప్రెస్​ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సామాజిక తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారన్నారు. కానీ ప్రస్తుతం రాచరిక పోకడలు కనిపిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సమాన అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. కానీ బీఆర్ఎస్​ పార్టీ .. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగించడం లేదని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్​ ప్రభుత్వం మాత్రం ఓడిపోయిన వాళ్లను బానిసల్లా చూస్తోందని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను జైళ్లో పెడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీమంతుల కోసం పనిచేస్తోంది తప్ప.. పేద ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. అదే ప్రజలను శత్రువులుగా చూస్తోందని విమర్శించారు. ఈ పదేళ్లల్లో కేసీఆర్​ ఏం చెప్పారు? ఏం చేశారో చూడాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు. గతంలో సచివాలయంలో జర్నలిస్టులకు చోటు ఉండేదని.. ఇప్పుడు ఆ అవకాశం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img