HomeరాజకీయాలుRevanth Reddy : దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్​ను తరిమికొట్టాలి

Revanth Reddy : దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్​ను తరిమికొట్టాలి

– అరాచకాలు, దుర్గాలను అంతం చేయాలి
– కాకా కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుంది
– తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి వెంకటస్వామి(కాకా)
– బెల్లంపల్లి భారీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బెల్లంపల్లి, చెన్నూరులో అరాచకాలు, దుర్మాగాలు పెరిగిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. అరాచకాలు ఆగలన్నా, దుర్మాగాలు పోవాలన్నా బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను, చెన్నూరులో బాల్క సుమన్​లను తరిమికొట్టాలన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. వెంకటస్వామి(కాకా) కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన వ్యక్తి కాకా అన్నారు. వివేక్ వెంకటస్వామి వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు సంపాదించారని, బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడో చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్​రెడ్డి హామీనిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొట్టే సమయం వచ్చిందన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందన్నారు. సోనియాగాంధీతో తెలంగాణ ఇప్పించిన ఘనత వెంకటస్వామికే దక్కిందని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అన్నారు. పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం వివేక్ ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణి సంస్థ మూతపడకుండా చూసి వేలాది మంది కార్మికులను వెంకటస్వామి ఆదుకున్నారన్నారు.

Recent

- Advertisment -spot_img