కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడు అని కేటీఆర్ ఆరోపించారు. చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని.. హైడ్రా పేరిట, మూసీ పేరిట నాశనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ చేతకానితనంతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది అని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే బావుండేది అని నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా రైతుబంధు, రుణమాఫీ కోసం రైతుల ఖాతాల్లో రూ. లక్ష కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని కేటీఆర్ గుర్తుచేశారు.