ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు ఏవీ ఈరోజువరకూ పూర్తి కాలేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అన్నారు. ఐటీ, ఫార్మా, ఔటర్ రింగురోడ్డు రావడం వల్లే షాద్‌నగర్‌లో భూముల ధరలు పెరిగాయన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే షాద్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఫైర్ అయ్యారు. షాద్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో రేవంత్ మాట్లాడారు.