Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి..నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మేమంతా చెబితే ని భార్య, బిడ్డ ఇంటికి కూడా...

రేవంత్ రెడ్డి..నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మేమంతా చెబితే ని భార్య, బిడ్డ ఇంటికి కూడా రానివ్వరు : పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.’రేవంత్ రెడ్డికి చెబుతున్నాను… నువ్వు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే..నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో..జూబ్లీహిల్స్‌లో ఏం చేశావు… దుబాయ్‌లో ఏం చేశావు…బెంగళూరులో ఏం చేశావు.. చెన్నైలో ఏం చేశావు… మేమంతా చెబితే.. మీ జీవిత భాగస్వామి మరియు ని బిడ్డ కూడా ఇంటికి రానివ్వరు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తనను ట్రాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో కేటీఆర్ ఉంటే కనుక డ్రగ్స్ కేసు పెట్టి ఇరికించాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించలేదని సీఎం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పోలీసులను తిట్టారన్నారు. పోలీసులకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి తన కారులో పెట్టాలని సూచించారని, ఈ విషయాన్ని పోలీసులే తనకు చెప్పారన్నారు. డ్రగ్ టెస్టులకు సిద్ధంగా ఉన్నామని… కాంగ్రెస్ నేతలు కూడా రావాలని.. లేదంటే వారు తీసుకున్నారని భావించాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదని, కేసీఆర్ కంటే అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసిరారు.

Recent

- Advertisment -spot_img