Homeహైదరాబాద్latest NewsRevanth Reddy : రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా.. రాహుల్ గాంధీ మాటల్లో ఆంతర్యం...

Revanth Reddy : రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా.. రాహుల్ గాంధీ మాటల్లో ఆంతర్యం ఏంటి..!!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందిని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు ఢిల్లీకి వెళ్తున్నారు కానీ రాహుల్ గాంధీని మాత్రం కలవలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఇస్తున్న ప్రాముఖ్యతను తగ్గించడానికే కాంగ్రెస్ హైకమాండ్ ఇదంతా చేస్తుంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినా విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే పార్టీలో కొన్ని అనుమానాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది బీజేపీ పార్టీ కోసం పని చేస్తున్నారు అని అనుమానాలు రావడంతో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్ నియమించారు. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది తీరుపై ఆమె నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ”కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కొంత మంది బీజేపీ కోసం పని చేస్తున్నారు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే వారిని త్వరలోనే కనుక్కుంటాం అని రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Recent

- Advertisment -spot_img