Homeహైదరాబాద్latest Newsమమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.. గ్రూప్-1 అభ్యర్థి ఆవేదన

మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.. గ్రూప్-1 అభ్యర్థి ఆవేదన

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అశోక్ నగర్‌లో గత రాత్రి నుంచి అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం గ్రూప్-1 అభ్యర్థులు సమిష్టిగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రూప్-1 అభ్యర్థులు మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని బలి దేవతలు అని అభివర్ణించారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అని అన్నాడు. రేవంత్ రెడ్డి ఒక సోనియా గాంధీ ఆనంద కోసం తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగుల తల్లులను రేవంత్ రెడ్డి కష్టపెడుతున్నారని గ్రూప్-1 అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ పరీక్షలను వాయిదా వేసి తమ డిమాండ్లను వినాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img