నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అని హరీష్ రావు అన్నారు. సంధ్య గారు, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి గారూ..! ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన అని హరీష్ రావు నిలదీశారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అని అన్నరు. కానీ, అవి లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదు అని ద్వజమెత్తారు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్ళు మూయిస్తరు? అని ప్రశ్నించారు. అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నడు. నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నడు అని హరీష్ రావు ఆరోపించారు.