సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం బ్లూ టిక్ మార్క్‌ను(Blue Tick Mark) కోల్పోయారు. దీంతో అసలేం జరిగిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు X వేదికగా చర్చించారు.
రేవంత్ రెడ్డి అకౌంట్ హ్యాక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రేవంత్ రెడ్డి తన ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి బ్లూటిక్ పోయినట్లు సీఎం సోషల్ మీడియా(Social Media) అకౌంట్లు చూస్తున్న టీమ్ స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్క్ తిరిగి వస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ప్లాట్‌ఫాంపై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలియజేశారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫొటోను డీపీగా పెట్టారు.