– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు గుప్పించారు. స్పైవేర్‌ని ఉపయోగించి తమ ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారని, ఇది గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. కానీ ఏదీ తమను అడ్డుకోదని, తమ చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రాధాన్యత ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడటమే అన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నట్లుగా ఉందని యాపిల్ నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తన ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. తనకు గత రాత్రి అటాకర్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని ట్వీట్ చేశారు. తాను ఉదయం తన మెయిల్‌లోకి వెళ్లి, యాపిల్ నుంచి వచ్చిన సందేశాన్ని చూశానని పేర్కొన్నారు.