Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మరోసారి ఘోర అవమానం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన జగ్గారెడ్డి.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ పలికారు. ఆ వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం గమనర్హం. అయితే గతంలో కూడా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ యాంకర్ పలికారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి అవమానం జరిగింది.