Revanth reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో త్వరలో పెద్దెత్తున చేరికలు
Revanth reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని వెల్లడించారు.
ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వారిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే, కాంగ్రెస్ లో చేరేవారి గురించి ముందు తెలుస్తుండడంతో, వారిపై టీఆర్ఎస్ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.
ఈ కారణంగానే కాంగ్రెస్ లో చేరేవారి పేర్లను వెల్లడించడంలేదని స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ, ప్రశాంత్ కిశోర్ లతో కలిసి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రశాంత్ కిశోర్ పథక రచన చేస్తున్నాడని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో విపక్షాలు తుడిచిపెట్టుకుపోవడానికి పీకేనే కారణమని ఆరోపించారు.
పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఈ జులై 7వ తేదీకి ఏడాది పూర్తవుతుందని రేవంత్ వెల్లడించారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న వ్యవహారాలను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు వివరించినట్టు తెలిపారు.