– కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి
– గాంధీ భవన్ వద్ద టికెట్ ఆశించిన నేతల నిరసన
– రేవంత్ దిష్టిబొమ్మ దహనం
ఇదే నిజం, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ మైనార్టీ నేతలు నిరసనకు దిగారు. బహుదూర్‌పురాలో ఖిలీమ్ బాబా, చాంద్రాయణగుట్టలో షకీల్ దయానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని నిరసస వ్యక్తం చేస్తూ.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాతబస్తీకి చెందిన టికెట్లు.. సంబంధం లేని వారికి ఇచ్చారని మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
మరో వైపు, టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించడానికి రేవంత్ వచ్చాడంటూ, ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వచ్చే లిస్ట్ సంబంధించిన వాళ్లది కూడా శాపనార్థాలు తగులుతాయంటూ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.. డబ్బులు ఇవ్వనందుకే ఉప్పల్ టికెట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని కాల్చివేశారు.