Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి అని కేటీఆర్ అన్నారు. వెంటనే లగచర్లలో.. అల్లుడి కోసం.. ఆదానీ కోసం..ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలి.. అక్కడ శాంతిని నెలకొల్పాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది అని కేటీఆర్ అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో ఇథనాల్ మంటలను రాజేశారు అని మండిపడ్డారు.
తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుంది అని అన్నారు. ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం..వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలి.. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు అని అన్నారు. లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కేటీఆర్ హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img