Homeహైదరాబాద్latest Newsసీఎం సీటును కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపాలి : కేటీఆర్

సీఎం సీటును కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపాలి : కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకునేందుకు ఢిల్లీకి డబ్బులు పంపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే హైడ్రామా పేరుతో అందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. సదుద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది…కానీ అది ఒక బ్లాక్ మెయిల్ దుకాణం అని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మేలు చేయాలని పాలకులు ఆలోచించలేదని కేటీఆర్ అన్నారు. మా తాతయ్యకు 400 ఎకరాల భూమి ఉందని…కానీ నీరు లేకపోవడంతో ఆ భూమి నిరుపయోగంగా ఉందని, ఆ భూమికి కూడా విలువ లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. కేసీఆర్ కృషి వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం సాధ్యం కాదని… సంపద సృష్టి జరగదన్నారు. కేసీఆర్ తొమ్మిదన్నరేళ్ల పాలనలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ప్రజలకు తెలుసని అన్నారు. అయితే ఎన్నికలకు ముందు మార్పు రావాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చూడాలన్నారు.

Recent

- Advertisment -spot_img