Revanth reddy : నల్గొండలోని SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. ఆ కార్మికులు మృతదేహాలను వెలికి తీసేందకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో సహాయక చర్యలు నేటికి 9వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) SLBC టన్నెల్ ను సందర్శించారు. అయితే ప్రమాదం జరిగిన తొమ్మిది రోజులకు సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలపై సీఎం ఆరా తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్క్యూ వివరాలు అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.