ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి కలిగిన వారి వివరాలను సేకరించాలన్నారు.