-ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికే మా మద్దతు
-అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడని ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీని నాశనం చేసినట్లే ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి ఉన్నాడని, కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తాము ఏ పార్టీ ఏ టీమ్, బీ టీమ్ కాదన్నారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని ఒవైసీ పేర్కొన్నారు.