Homeహైదరాబాద్latest NewsRevanth.. KCR ను తిట్టడమేనా నీ పని

Revanth.. KCR ను తిట్టడమేనా నీ పని

– కరువు పరిస్థితిని పట్టించుకోవా?

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

ఇదేనిజం, నల్లగొండ: రాష్ట్రంలో ఓ వైపున రైతులు కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి అదేమీ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను తిట్టడమేనా.. రేవంత్ రెడ్డి పని అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఓ వైపు కరువు పరిస్థితి ఉంటే సీఎం దాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని ఆరోపించారు. కరువు పర్యటనలు చేపట్టి వెంటనే రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు కరువుపై ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయం, ఎక్కడ నీళ్ల కోసం అడ్డుపడతారోననే జంకుతో ఇప్పటికీ వ్యవసాయరంగంపై సమీక్ష చేసేందుకు సీఎం వెనకాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వ్యవసాయ, సాగునీటి శాఖలపై సమీక్షలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు తాగునీళ్లు లేక ప్రజలు.. సాగునీళ్లు లేక రైతులు అల్లాడిపోతుంటే సోయి లేకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మానవబాంబులు తయారు చేయడానికి ఉగ్రవాదివా..? పేగులు మెడలో వేసుకొని తిరగడానికి నువ్వేమన్న కసాయోడివా? ముఖ్యమంత్రివా..?’ అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img