Homeహైదరాబాద్latest Newsరేవంత్‌ ఒంటెద్దు పోకడ ..త్వరలోనే పార్టీలో చిచ్చు రేపే అవకాశాలు..

రేవంత్‌ ఒంటెద్దు పోకడ ..త్వరలోనే పార్టీలో చిచ్చు రేపే అవకాశాలు..

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. పదేళ్ల అనంతరం తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ పార్టీ సుస్థిరమైన సంఖ్యతో అధికారంలోకి వచ్చింది.. కానీ రేవంత్ రెడ్డి సంఖ్యా బలం తగినంత ఉన్నా కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. గులాబీ పార్టీని దెబ్బతీయాలనే పట్టుదలతో రేవంత్ వేస్తున్న అడుగులు సొంత పార్టీలో చిచ్చు రేపుతోంది. సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఆ పార్టీలో మరింత చిచ్చు రేపింది. రేవంత్ ఒంటెద్దు పోకడలా దూకుడు కనబరుస్తుండడంతో అతడి తీరుపై సీనియర్ నాయకులు మండిపడుతున్నారు..

పార్టీలో ఏం జరుగుతుందో సీనియర్ నాయకులకు తెలియకుండా రేవంత్ ముందుకు వెళ్తుండడంతో త్వరలోనే పార్టీలో చిచ్చు రేపే అవకాశాలు ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతడి కుమార్తె కడియం కావ్య చేరికతో వరంగల్లో విబేధాలు వచ్చాయి. వరంగల్ మేయర్ గుండు సుధారాణి చేరిక కూడా వివాదాస్పదమైంది. పోచారం చేరికతో బాన్సువాడ నియోజకవర్గంలో అసంతృప్తులు బయటపడ్డాయి. బహిరంగంగానే పోచారం రాకను పార్టీ శ్రేణులు వ్యతిరేకించారు. హైదరాబాద్లో దానం నాగేందర్ చేరిక కూడా రోహిణ్ రెడ్డి, పి విజయా రెడ్డి వర్గంలో అసంతృప్తి ఉంది. కానీ ఇంకా బయటపడలేదు. పట్నం మహేందర్ రెడ్డి దంపతుల చేరిక కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దుమారం రేపింది..

Recent

- Advertisment -spot_img