ఇదే నిజం దేవరకొండ: చందంపేట మండల పరిషత్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ మండలంలో త్రాగునీరు విద్యుత్ విద్యా వైద్యం రవాణాకు సంబంధించిన విభాగాలతో పాటు, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చ గావించారు, ఎంపీపీ పార్వతీ చందు నాయక్ అధ్యక్షత నిర్వహించబడిన జనరల్ బాడీ చివరి సమావేశం అయినందుకు, గత ఐదేళ్ల నుంచి ప్రజాప్రతితులుగా సేవలందించిన సభ్యులకు ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి ,మండల తహసిల్దార్, ఎంపీపీ పార్వతీ చందు నాయక్, వైస్ ఎంపీపీ జాలే ప్రేమలత నర్సింహారెడ్డి, జెడ్పిటిసి బుజ్జి లచ్చిరాం నాయక్, పిఎసిఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బధ్యానాయక్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.