ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అడక్ కమిటీ కో కన్వీనర్ జంగా భూమరాజం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యతిరేక పోరాట సమితి పిలుపుమేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 21వ తేదీన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల ప్రజలకు వాణిజ్య వ్యాపార సంస్థలు అన్ని వర్గాల ప్రజలు బంద్ కు సహకరించాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణ అధ్యక్షులు మీసా శ్రీనివాస్, ఎస్సీ వర్గీకరణ అడగ్ కమిటీ కో కన్వీనర్ జంగా భూమరాజం, మాల మహానాడు నాయకులు మీస శంకర్, బెల్లం స్వామి,శాగల లక్ష్మణ్, .గువ్వల రవి, పిట్ల చంద్రం, ఇరిగి సుందరయ్య, గాదం నర్సింలు, జంగటి బక్కయ్య, కొప్పు నరసయ్య, మీసా నాగేందర్, బాబు మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.