RGV : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఒక్కపుడు ”శివ” సినిమాతో కెరీర్ ప్రారంభించి.. ‘సత్య’, ‘కంపెనీ’, ‘రంగీలా’ వంటి సినిమాలతో కొత్త ఒరవడిని సినీ ఇండస్ట్రీలో సృష్టించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మంచి సినిమాలు తీసి, చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆర్జీవీ.. ఇప్పుడు మాత్రం వరుసగా చెత్త సినిమాలు తీసి తన పేరును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీతో సినిమా చేయడానికి ఒక హీరో కూడా ముందుకు రావడం లేదు. అయితే ఇటీవలే ఆర్జీవీ తన సత్తా ఏంటో మరోసారి చూపించాలి అని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో ”సిండికేట్” అనే తన కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. అయితే ఈ సినిమాకు హీరో కష్టాలు వచ్చాయి. ఆర్జీవీ ఈ సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో చాలా మందిని సంప్రదించారు అని కానీ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు అని సమాచారం.
అయితే ఒక స్టార్ హీరో మాత్రం ఆర్జీవీ కోసం సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు.. ఫ్యామిలీ స్టార్ వెంకటేష్.. అవును ఆర్జీవీ ”సిండికేట్” సినిమాలో వెంకటేష్ హీరోగా నటించడబోతున్నాడు. ఇప్పటికే ఆర్జీవీ వెంకటేష్ కు కధ చెప్పాడని.. దానికి వెంకటేష్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అని సమాచారం. అయితే ”సంక్రాంతికి వస్తునాం” లాంటి భారీ హిట్ సినిమా తరువాత వెంకటేష్ ఆర్జీవీ తో సినిమా చేయడం.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ”క్షణం క్షణం” అనే సినిమా చేసారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.