Homeక్రైంఅనుమతి లేకుండా మార్చురీలో 45 నిమిషాలు రియా...

అనుమతి లేకుండా మార్చురీలో 45 నిమిషాలు రియా…

సుశాంత్​ రాజ్​పుత్​ అనుమానాస్పద మృతిపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వేగం పెంచింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ ఇంటి వంట మనిషి నీరజ్ సింగ్​ను విచారించారు సీబీఐ అధికారులు. శాంటాక్రజ్​లోని ఓ గెస్ట్ హౌస్ లో నీరజ్ పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

అధికారులు సుశాంత్​తో పాటు ఉంటున్న సిద్ధార్థ్ పితానిని కూడా ప్రశ్నించారు. వారిద్దరి నుంచి పలు కీలక సమాచారం రాబట్టారు. అనంతరం సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న బాంద్రా ఫ్లాట్ ను సీబీఐ అధికారులు సందర్శించారు. అనంతరం ముంబయిలోని కూపర్ ఆసుపత్రికి వెళ్లారు సిబీఐ అధికారులు. సుశాంత్ మృతదేహాన్ని ఉంచిన మార్చురీలో రియా చక్రవర్తి అధికారిక అనుమతి లేకుండానే 45 నిమిషాల సేపు గడిపిందన్న విషయాన్ని గమనించారు అధికారులు. అనుమతి లేకుండా అనధికారికంగా రియా అంత సేపు అక్కడ ఎందుకుందని విచారణ చేస్తున్నారు అధికారులు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img