Homeఅంతర్జాతీయం#Asteroid #NASA : లక్ష కోట్ల కోట్లు విలువైన గ్రహశకలం

#Asteroid #NASA : లక్ష కోట్ల కోట్లు విలువైన గ్రహశకలం

సౌరకుటుంబంలోని అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య గల ఆస్టరాయిడ్‌ బెల్ట్‌లో ఉన్న ‘సైక్‌ 6’ అనే గ్రహశకలంలో ఐరన్‌, నికెల్‌, బంగారం, ప్లాటినమ్‌, కాపర్‌ వంటి అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

ఆ గ్రహశకలం ఉపరితల ఉష్ణోగ్రతలను అంచనా వేయడంలో భాగంగా తాజాగా చేసిన విశ్లేషణల్లో ఈ విషయం బయటపడినట్టు వెల్లడించారు.

ఈ లోహాల విలువ ప్రస్తుత మార్కెట్లో 10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లుగా (రూ. లక్ష కోట్ల కోట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎప్పుడో 1852లో గుర్తించిన ఓ గ్రహశకలం ఉన్నట్టుండి అమూల్యమైన సంపదలతో తులతూగుతున్నదని తెలియడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, ఈ సంపదను ప్రపంచంలోని మొత్తం జనాభాకు పంచితే అందరూ బిలియనీర్లు కావొచ్చని పరిశోధకులు తెలిపారు.

కాగా, ఈ గ్రహశకలంపై పరిశోధనలకు గానూ వచ్చే ఏడాది నాసా ఓ మిషన్‌ను పంపించనున్నది.

2026లో ఆస్టరాయిడ్‌ కక్ష్యలోకి చేరుకోనున్న ఈ మిషన్‌ గ్రహశకలం పుట్టుక, నేల స్వభావం, లోహాల విలువ తదితర సమస్త సమాచారాన్ని విశ్లేషించనున్నది.

Recent

- Advertisment -spot_img