- రీమన్ హైపోథీసిస్ లెక్క తేల్చిండు
- 161 ఏళ్లుగా ఆన్సర్ లేని ప్రశ్నకు శ్రీనిధి ఇనిస్టిట్యూట్ప్రొఫెసర్ పరిష్కారం
- రూ.7.3 కోట్లు గెలుచుకున్న కుమార్ ఈశ్వరన్
మ్యాథమేటిక్స్‌లో 161 ఏళ్లుగా ‘జవాబు’ లేని సవాల్ అది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఆ థియరీకి పరిష్కారం దొరకలేదు.
కానీ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార్ ఈశ్వరన్ దానికి పరిష్కారం కనుగొన్నారు.
‘రీమన్ హైపోథీసిస్’ వేసిన చిక్కుముడులను శ్రీనిధి ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ ప్రొఫెసర్ అయిన ఆయన విప్పేశారు. ఆ సిద్ధాంతాన్ని ‘ప్రూవ్’ చేసి చూపించారు.
పరిష్కారానికి మిలియన్ డాలర్లు…
లెక్కల్లో పరిష్కారం కాని టాప్ పది సిద్ధాంతాల్లో రీమన్ హైపోథీసిస్ మొదటి స్థానంలో ఉంటుంది.
దీన్ని పరిష్కరిస్తే పది లక్షల డాలర్లు (సుమారు రూ.7.3 కోట్లు) బహుమతి ఇస్తామని కేంబ్రిడ్జిలోని క్లే మ్యాథమేటిక్ సంస్థ ప్రకటించింది.
ప్రముఖ మ్యాథ్స్ సైంటిస్ట్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్ చేసిన లెక్కల నుంచి రీమన్ హైపోథీసిస్ వచ్చింది.
ఆయన సూత్రం ప్రకారం ఏదైనా ఒక సంఖ్య కంటే తక్కువ ప్రధాన సంఖ్యల సంఖ్యను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
తర్వాతి కాలంలో జార్జ్ ఫ్రెడరిక్ బెర్నార్డ్ రీమన్.. ఆ సూత్రాన్ని మెరుగుపరిచారు. సంక్లిష్ట వేరియబుల్ ఫంక్షన్ల కాలిక్యులస్తో కొత్త పద్ధతిని ఉపయోగించారు.
ఐదేళ్లుగా రివ్యూలు…
సంక్షిష్ట వేరియబుల్‌లో ప్రత్యేకంగా తీసుకున్న ఫంక్షన్లో విశ్లేషణాత్మక ప్రవర్తనను నిర్ణయిస్తే రీమన్హైపోథీసిస్నుపరిష్కరించవచ్చని ఈశ్వరన్ రుజువు చేశారు.
సంఖ్యల అంకగణిత లక్షణాలను ఉపయోగించడంతో హైపోథీసిస్ సక్సెస్ అయినట్టు తేల్చారు.
ఈశ్వరన్ రుజువు చేసిన హైపోథీసిస్ను దాదాపు ఐదేళ్ల కిందట 2016లోనే ఇంటర్నెట్లో పెట్టారు.
దీన్ని పరిశీలించేందుకు శ్రీనిధి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని 2021 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు.
ఈ కమిటీకి జాతీయ స్థాయి సలహాదారుగా దేశ శాస్ట్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి టి. రామస్వామి ఉన్నారు.
శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నర్సింహా రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామన్, చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస రావు, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ వినాయక్ ఈశ్వరన్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఈ సిద్ధాంతాన్ని1,200 మందికిపైగా మ్యాథ్స్ నిపుణులు రివ్యూ చేశారు.
ఇంటర్నేషనల్ నిపుణులు సమీక్షలు పంపిస్తే ఈశ్వరన్ సమాధానాలు ఇచ్చారు.
ఈ ఏడాది మే 16న జరిగిన చివరి సమావేశంలో రీమన్ హైపోథీసిస్కు ఈశ్వరన్ ప్రతిపాదించిన సిద్ధాంతం సరైందని కమిటీ తేల్చింది.
ఈ సిద్ధాంతం గురించి పూర్తి సమాచారాన్ని మొదటగా ఈ–బుక్ ద్వారా ప్రచురించి, తర్వాత పుస్తక రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు…