ఇదే నిజం దేవరకొండ: సమాచార హక్కు ప్రచార సమితి దేవరకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా ముకురోజు రాజును రాష్ట్ర అధ్యక్షుడు కాట్రవత్ రాజు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. నియామక పత్రాన్ని అందజేశాడు. నూతనంగా ఉపాధ్యక్షులుగా నియామకం అయినా రాజు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రజలకు సేవ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తానని ప్రచార సమితి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని కమిటీ నిర్ణయాలు ఆదేశాల మేరకు నడుచుకుంటానని ప్రజలందరి మేలు కోసం కృషి చేస్తానని అలాగే బాధ్యతాయుతంగా క్రియాశీలకంగా నడుచుకుంటానని ఆయన అన్నారు. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.