రిషబ్ శెట్టి హీరోగా నటించిన సినిమా ‘కాంతారా’. ఈ సినిమా సెప్టెంబర్ 2022లో విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు.ఈ ఘనత అందుకున్న సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చే సినిమాలు తీయడమే తన ఉద్దేశమని చెప్పాడు. “ప్రతి సినిమా ప్రభావం ఉంటుంది. సమాజంలో మార్పు లేదా ప్రభావం చూపే సినిమాలు తీయడమే మా ఉద్దేశం.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. జాతీయ అవార్డులు ఒక కళాకారుడికి చాలా ప్రతిష్టాత్మకమైన బహుమతి” అని ఆయన అన్నారు. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, “నేను కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని గుర్తించినందుకు జాతీయ అవార్డుల ప్యానెల్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు ఈ సినిమాని విజయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆయన తెలిపారు.