Homeక్రైంroad accident: స్కూల్‌ వ్యాన్‌ కిందపడి బాలుడు దుర్మరణం

road accident: స్కూల్‌ వ్యాన్‌ కిందపడి బాలుడు దుర్మరణం

road accident: ఇదే నిజం, భీమదేవరపల్లి: స్కూల్‌ వ్యాన్‌ కిందపడి బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లో మంగళవారం చోటు చేసుకున్నది. భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లికి చెందిన దండవేన శరత్ – మమత దంపతుల పెద్ద కుమారుడు సాన్విక్ గట్లనర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. రోజు సాన్విక్ స్కూలుకు వ్యాన్ లో వెళుతున్నాడు. రోజు లాగానే మంగళవారం తన కొడుకును స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా చిన్న కుమారుడు శివాన్ష్(3) వెంట వచ్చాడు. శివాన్స్​ బస్సు ఎదురుగా పరిగెత్తాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించడంతో ముందు టైర్ కింద పడిన శివాన్ష్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img