Homeహైదరాబాద్latest Newsరోడ్డు ప్రమాదం.. 13మంది సజీవదహనం

రోడ్డు ప్రమాదం.. 13మంది సజీవదహనం

 

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై సంభవించి 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌ గుణ జిల్లా నుంచి ఆరోన్ వైపు ఓ ప్రయివేటు బస్సు బయలుదేరింది. సరిగ్గా రాత్రి 8.30గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టి బోల్తాపడింది.

దీంతో బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవదహమవ్వగా మరో 17 మంది తీవ్రగాయాలపాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించి ఆసుపత్రికి తరలించారు. చీకట్లో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు 50 వేల చొప్పున, మృతుల కుటుంబాలకు 4 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img