హైదరాబాద్ లోని పంజాగుట్టలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న టెంపో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెళ్తున్న మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా.. ఎస్ఐ శంకర్రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఎస్ఐ తన కూతురితో కలిసి బేగంపేట నుంచి పంజాగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.