– రాహుల్ ర్యాలీలో బైక్పై నుంచి పడిన సురేఖ
– కంటతడి పెట్టుకున్న కొండా మురళీ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి పేరిట బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొండా సురేఖ కూడా పాల్గొని స్కూటీ నడిపారు. అయితే ఆమె నడిపిన బైక్ అదుపుతప్పడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమెకు ముఖంతో పాటు చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గన్మెన్లు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన ఆస్పత్రికి చేరుకుని సురేఖకు తగిలిన గాయాలు చూసి కంటతడి పెట్టుకున్నారు.