Homeక్రైండ్రైవర్​ నిర్లక్ష్యం.. బలైన నిండు గర్భిణి

డ్రైవర్​ నిర్లక్ష్యం.. బలైన నిండు గర్భిణి

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురుని బలితీసుకుంది. డ్రైవర్​ చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొంది. ఈ ఘటనలో నిండు గర్భిణితోపాటు వాళ్ల కుటుంబంలోని ఏడుగురు మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా అలండ్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా గర్భణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో గర్భిణి సహా ఏడుగురు మరణించారు. మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img