Homeజిల్లా వార్తలుమదీనగూడలో నడిరోడ్డు కుంగుబాటు.. అప్రమత్తమైన స్థానికులు తప్పిన ముప్పు..

మదీనగూడలో నడిరోడ్డు కుంగుబాటు.. అప్రమత్తమైన స్థానికులు తప్పిన ముప్పు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని చందానగర్ డివిజన్ మదీనగూడ దీప్తిశ్రీ నగర్ నుంచి శాంతినగర్ వెళ్ళే మలుపు నడిరొడ్డులో రోడ్డుకుంగి భారీ గుంత ఏర్పడింది. నిత్యం వేలాది మంది తిరిగే ప్రాంతం కావడం శుక్రవారం మధ్యాహ్నం 3 గం సమయంలో ఉన్నట్టుండి రోడ్డు కుంగడంతోభారీ గుంత ఏర్పడింది. దీంతో సుమారు 3 మీ వెడల్పు , 2 మీ లోతులో గుంత ఏర్పడింది. దీంతో స్థానికులు భయ బ్రాంతులకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తం కావడంతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డున అనుకొని ఉన్న ఓపెన్ నాలా నుంచి నీరు డ్రైనేజీ పైప్ లైన్ లో నుంచి రోడ్డు మధ్యకు రావడంతో ఉన్నట్టుండి కింద రోడ్డు కోతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా సీవరేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంవల్లనే రోడ్డు కుంగు బాటుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంజరింగ్ అధికారులు అక్కడకు చేరుకొని పరిశీలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img