నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా రామాయణంలో నటుడు యష్ ‘రావణ’గా నటిస్తున్నాడు. ఇటీవల యష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘రామాయణం’కి యష్ పారితోషికం రూ.200 కోట్లుగా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే యష్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. యష్ ఈసారి కూడా తన అభిమానులతో తన పుట్టినరోజును జరుపుకోవడం లేదు. జనవరి 8 యశ్ పుట్టినరోజు. అభిమానులకు నిరాశ కలిగించే వార్తను రాకింగ్ స్టార్ యష్ అందించాడు. ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు లేవని పోస్ట్ ద్వారా యష్ తెలిపారు. 2018 తర్వాత ఇప్పటి వరకు అభిమానులతో కలిసి పుట్టినరోజు జరుపుకోలేదు. ఇంతకుముందు, యశ్ పుట్టినరోజు కోసం ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ముగ్గురు అభిమానులు మరణించారు. దీనితో హీరో యాష్ తాజాగా ఈ నిర్ణయాన్ని తీస్కున్నారు. ప్రస్తుతం యాష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.