ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథనం వేరు. ప్రత్యర్థి జట్లతో పోరాడే బదులు, కొత్త జట్టు లోనే వివాదాలతో నిరాశ పరిచింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ‘కెప్టెన్సీ మార్పు’ నిర్ణయం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిందనే చాలా మంది అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టులో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని చాలా వార్తలు వచ్చాయి. ఈ కథనాలకు ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఈ సీజన్ తర్వాత ప్రతి జట్టు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతించబడుతుంది.
అయితే ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. స్టార్ ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన జట్టు విజయాలు సాధిస్తుందని చెప్పలేమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘షారుక్, సల్మాన్, ఆమిర్ ఒకే సినిమాలో నటించినంత మాత్రాన హిట్ అవుతుందన్న గ్యారెంటీలేదు. బలమైన స్క్రిప్ట్ అవసరం. రోహిత్‌శర్మ సెంచరీ చేసినా.. ఇతరులు ఆడకపోవడంతో ముంబై ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఆ జట్టు బుమ్రా, సూర్యను మాత్రమే రిటైన్ చేసుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.