Homeఆంధ్రప్రదేశ్Roja : టికెట్​ ఇవ్వకపోయినా జగనన్న వెంటే..

Roja : టికెట్​ ఇవ్వకపోయినా జగనన్న వెంటే..

– మంత్రి రోజా సంచలన ప్రకటన

ఇదేనిజం, ఏపీబ్యూరో: వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్​ దక్కడం లేదని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్​చార్జ్​లను నియమిస్తున్నారు. కాగా నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు సైతం ఈ సారి టికెట్ కష్టమేనని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాజాగా రోజా సంచలన ప్రకటన చేశారు. తనకు టికెట్ దక్కినా దక్కకపోయినా జగన్​ వెంటే ఉంటానంటూ ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారన్నారు. ‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా​‍​. మిషన్‌ 2024లో 175/175లో భాగం అవుతానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యమని, సీఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img