Homeహైదరాబాద్Love with Biryani : లవ్ విత్ బిర్యా నీ అంటున్న రోల్ రైడా

Love with Biryani : లవ్ విత్ బిర్యా నీ అంటున్న రోల్ రైడా

Love with Biryani : లవ్ విత్ బిర్యా నీ అంటున్న రోల్ రైడా

Love with Biryani – బిర్యానీ అంటేనే ఓ సెలబ్రేషన్. ‘లవ్ విత్ బిర్యానికి అది తెలుసు, ఇది తనిసి రెస్టారెంట్స్ ఇన్ కార్పొరేటెడ్ నుంచి వచ్చిన మరో బిర్యానీ బ్రాండ్.

నేడు హైదరాబాద్ నగరంలో ప్రముఖ తెలుగు పాపులర్ ర్యాప్ స్టార్ రోల్ రైడా హుషారైన పాటతో దీనిని ఘనంగా ప్రారంభించారు.

ఆ సింగర్ మరియు ర్యాపర్ బిర్యానీ ప్రేమికుల కోసం ఈ పాటని అంకితం చేశారు.

తన పాటకు శ్రోతలు ఆడి పాడి అలరించారు. ఈ ‘లవ్ విత్ బిర్యానీ’ పాటను శ్రోతలు విని ఆనందించడానికి ప్రముఖ సోషియల్ మీడియా ప్లాట్ ఫాం అన్నింటిలోనూ ఆవిష్కరించారు.

ఆ పాట వింటూ ఈ బిర్యానీ తింటూ ఆ అనుభూతిని అనుభవించి తీరాల్సిందే! ఆ ప్రాంతమంతా బిర్యానీ సువాసనలతో మరియు ఘుమఘుమలతొ ఆహ్లాద కరంగా మారింది.

లవ్ విత్ బిర్యానీ వాళ్లు తయారుచేసిన స్పెషల్ పండగ బిర్యానీ గిఫ్ట్ ప్యాక్ లు బిర్యానికే వన్నె తెచ్చాయి.

కెనడాలో నాణ్యమైన, సంపద్రాయకపరమైన రుచులు అందించినది చార్మినార్ ఇండియన్ కుజీన్ గ్రూప్.

వారు విదేశంలో స్వదేశీ వంటకాలను అందరికీ అందుబాటులో ఉండేలా విజయవంతంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తలు.

వాళ్లు ఆవిష్కరించిన సరికొత్త బ్రాండ్ ఈ లవ్ విత్ బిర్యానీ.

ఈ అద్భుత రుచులనే తనిసి రెస్టారెంట్ల పేరుతో భారతదేశంలో ప్రవేశపెట్టింది.

త్వరలో మరికొన్ని శాఖలను కూడా ప్రారంభించనుంది.

తనిసి రెస్టారెంట్స్ ఇన్ కార్పొరేటెడ్ వ్యవస్థాపకులు సత్య శివకృష్ణ రాపాక మాట్లాడుతూ “ఆహారం మరియు సంగీతం, విభిన్న సంస్కృతుల మధ్య సరిహద్దులను చెరిపివేస్తాయి.

నిజానికి రుచికరమైన బిర్యానీలను 60 పైన తయారు చేయడం ఓ గాఢమైన అనుభూతిని ఇస్తుంది.

ఈ ఉద్వేగాన్ని పంచుకోడానికి సరైన ట్యూన్ ని ఎంచుకోగలిగాము.

రోల్ రైడా పాటని అద్భుతంగా రూపొందించారు.

హైదరాబాద్లోని ఆహారప్రియులంతా బిర్యానీ రుచినీ, ఆ పాట శృతిని ఆస్వాదిస్తూ , ఆనందిస్తారనే” నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ర్యాపర్ రోల్ రైడా మాట్లాడుతూ “నేనెప్పుడూ బిర్యానీ బ్రాండ్ కోసం పాటను రూపొందించలేదు.

పాట కోసం నన్ను వీళ్ళు కలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అదే సమయంలో దీన్ని చాలెంజ్ గా తీసుకున్నాను.

స్వతహాగా బిర్యానీ ప్రియుడినైన నేను అందరి నోరూరించేలా పాటను రూపొందించాలని అనుకున్నా.

ఈ పాట బిర్యానీ ప్రియులందరినీ ఒకేచోట చేర్చి సంతోష పరుస్తుందని భావిస్తున్నా” అని చెప్పారు.

ప్రారంభోత్సవం రోజున బిర్యానీల కోసం వచ్చేవారూ, ఆతిథులూ, ప్రముఖల రాకపోకలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

ఘుమఘమలాడే బిర్యానీ ప్యాకెట్లను కొనటానికి జనం పోటీపడ్డారు.

ఈ ప్యాక్ లు రూ 249 /- ధర నుండి లభిస్తాయి.

నాణ్యమైన చికెన్, మటన్, సీఫుడ్స్ , ఎగ్, వెజ్ బిర్యానీల కోసం జొమాటో, స్విగ్గీ మరియు లవ్ విత్ బిర్యానీ వెబ్సైట్ల ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

ఆ ప్యాకేజీలు ఒకరికి సరిపడా రెగ్యులర్ సైజులో, ఆరుగురికి సరిపడా ఫ్యామిలీ ప్యాక్ లలో లభిస్తాయి.

లవ్ విత్ బిర్యానీ పాటను ఈ దిగువ పేర్కొన్న సైట్లలో చూడవచ్చు .

Instagram

Facebook

Twitter

Youtube

తనిసి రెస్టారెంట్స్ ఇన్ కార్పొరేటెడ్ ఈ నెలలో “వంట కథలు” (సంప్రదాయబద్ధమైన తెలుగు రుచులను) కూడా ప్రారంభించనున్నారు.

Recent

- Advertisment -spot_img