డిసైడర్ లో చెన్నై తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ గెలిచింది. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్సీబీ విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 191 పరుగులకే పరితమయింది. టోర్నీ నుంచి అందరికంటే ముందుగానే నిష్క్రమిస్తుందనుకున్న జట్టు ప్లే ఆఫ్స్ కు చేరి సంచలనం సృష్టించింది.
5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నైను మట్టికరిపించింది. చివరి ఓవర్లో 16 రన్స్ చేస్తే ప్లేఆఫ్స్ కు చెన్నై క్వాలిఫై అయ్యేది. కానీ ధోనీ ఔట్ అవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన డుప్లెసిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తదుపరి మ్యాచ్ ఎలిమినేటర్ srh లేదా rr తో మే 22 న అహ్మదాబాద్ లో ఆడనుంది.