RRR Oscar: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ అవార్డు వస్తుందా రాదా అని బాషా , ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రతీ ఇండియన్ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు.ఎలా అయినా ఈ అవార్డు రావాలని వాళ్ళు కొలిచే దేవుళ్ళకు మొక్కుకున్నారు కూడా.వాళ్ళ మొక్కులు మొత్తానికి ఫలించాయి.
RRR చిత్రం లోని నాటు నాటు పాటకి గాను ఆస్కార్ అవార్డు దక్కింది.ఇది నిజంగా తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వించదగ్గ విషయం.నిన్న మొన్నటి వరకు మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అంటూ గొడవలు వేసుకున్న సినీ అభిమానులందరూ, ఇలా ఒకే తాటి పైకి వచ్చి గర్వంగా ఇది మా ఇండియన్ సినిమా అని చెప్పుకునేలా చేసింది మన తెలుగు సినిమా.ఈ పాట ఈ రేంజ్ లో ఖండాలను దాటి రీచ్ అయ్యి ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడానికి ప్రధాన కారణం కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని చెప్పొచ్చు.
ఆయనే ఇంత అద్భుతమైన స్టెప్స్ ని కంపోజ్ చేసి ఉండకపోతే ఈరోజు ఈ పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు.ఆ తర్వాతి క్రెడిట్ మాత్రం రామ్ చరణ్ – ఎన్టీఆర్ లదే.వాళ్ళ వల్లే ఈ పాటకి ఈ రేంజ్ రీచ్ వచ్చింది.
భాష, దేశంతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సాంగ్ కి లేచి ఎగురుతున్నారు అంటే వీళ్ళే కారణం.ఇక మూడవ క్రెడిట్ మాత్రం కీరవాణీదే.ఆయనే కనుక ఇంత ఫాస్ట్ బీట్ సాంగ్ కంపోజ్ చేసి ఉండకపోతే అసలు పాటే ఉండేది కాదు.ఇక్క పర్ఫెక్షన్ కోసం పరితపించే రాజమౌళి కి క్రెడిట్ ఇవ్వకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా?, ఆయన వల్లే హీరోలిద్దరు అంత సింక్ తో డ్యాన్స్ వేసి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా చేసింది.