ప్రధాని మోదీ పీఎం కిసాన్ 18వ విడత నిధులను శనివారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి. అయితే నగదు జమ కాని వారు పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు.