భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం పర్యటించారు. అశ్వారావుపేటలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆధునిక టర్బైన్ను ప్రారంభించారు. 20 వేల మెగావాట్ల కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ. 73 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ. 18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతుల రుణమాఫీపై ఆలోచిస్తున్నామని చెప్పారు.